బీజేపీకి పెరుగుతున్న గ్రాఫ్
ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్
న్యూఢిల్లీ – ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఆయన ముందస్తు ఫలితాలపై ఓ కన్నేసి ఉంచారు . ఈ మేరకు గతంలో కంటే ఈసారి భారీ ఎత్తున బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగే ఛాన్స్ లేక పోలేదన్నారు. ఆదివారం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు.
తమిళనాడులో ఓట్ల శాతంలో బీజేపీ రెండెంకల్లో ఉందన్నారు. ఇది తొలిసారి కావడం గమనార్హం అని పేర్కొన్నారు ప్రశాంత్ కిషోర్. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ పార్టీ రెండో స్థానంలోకి రాబోతోందని జోష్యం చెప్పారు. ఇప్పటికే అసెంబ్లీ స్థానాలలో సరైన వ్యూహం అమలు పరిచి ఉంటే కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు వచ్చి ఉండేవి కావన్నారు. ఎటొచ్చి ఇక్కడ బలంగా ఉన్న బీఆర్ఎస్ కేవలం ఒకటిన్నర శాతం ఓట్ల తేడాతో చాలా సీట్లను కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు పీకే.
ఇక ఒడిశా విషయానికి వస్తే బీజేపీ ఈసారి నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకుంటుందన్నారు. అయితే పశ్చిమ బెంగాల్ లో కాషాయ పార్టీ టాప్ లో ఉంటుందని అంటే మాత్రం ఒకింత ఆశ్చర్యం కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రశాంత్ కిషోర్.