NEWSNATIONAL

త‌మిళ నాట బీజేపీ జోష్ – పీకే

Share it with your family & friends

ఈసారి పెర‌గ‌నున్న ఓటు శాతం

న్యూఢిల్లీ – భార‌తీయ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో దేశ వ్యాప్తంగా జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోదీ సార‌థ్యంలోని భార‌తీయ జ‌న‌తా పార్టీ సంకీర్ణ ప్ర‌భుత్వం తిరిగి మూడోసారి కొలువు తీర‌నుంద‌ని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

బీహార్ సీఎం నితీశ్ కుమార్ సార‌థ్యంలో ఏర్పాటు చేసిన ఇండియా కూట‌మి పూర్తిగా ఫెయిల్ అయ్యింద‌న్నారు. ఆయ‌న ఎక్క‌డా ఒక చోట కుదురుగా ఉండ‌ర‌ని ఎద్దేవా చేశారు. ఆయ‌న‌ను న‌మ్ముకుని కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ల‌డం త‌నను విస్తు పోయేలా చేసింద‌న్నారు.

ఇప్పుడు బీజేపీ మ‌రింత బ‌ల‌ప‌డుతోంద‌ని అన్నారు. విచిత్రం ఏమిటంటే త‌మిళ‌నాడులో ఊహించని రీతిలో కాషాయ పార్టీకి ఆద‌ర‌ణ పెరుగుతోంద‌ని, ఇది అధికారంలో ఉన్న డీఎంకేకు ప్ర‌మాద‌మేన‌ని హెచ్చ‌రించారు.

గ‌ణ‌నీయంగా పెర‌గ‌డం ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌న్నారు ప్ర‌శాంత్ కిషోర్. ఈసారి ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడులో బీజేపీకి రెండెంక‌ల ఓటు షేర్ సాధించ‌డం ఖాయ‌మ‌న్నారు.