ఈసారి ఎన్నికల్లో బీజేపీ హవా
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ – భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందని జోష్యం చెప్పారు. ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో 2019లో జరిగిన ఎన్నికల్లో కంటే ఈసారి 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ బలం మరింత పెరగనుందని, ఇది ఓట్ల రూపంలో అత్యధికంగా సీట్లు సాధించేందుకు దోహద పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
తాను ఏ ఒక్కరి మెప్పు కోసమో పని చేయడం లేదని చెప్పారు ప్రశాంత్ కిషోర్. కానీ దేశంలోని ప్రధాన పార్టీలన్నీ తనతో టచ్ లో ఉంటాయని , ఇది మామూలు విషయమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమి కూడా ప్రభావం చూపే అవకాశం లేక పోలేదని అభిప్రాయపడ్డారు ప్రశాంత్ కిషోర్.