సంచలన ప్రకటన చేసిన ప్రశాంత్ కిషోర్
తమిళనాడు – ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన దళపతి విజయ్ స్థాపించిన పార్టీతో జత కట్టారు. ఈ సందర్బంగా మహాబలిపురంలో జరిగిన టీవీకే తొలి వార్షికోత్సవ మహానాడులో ప్రసంగించారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో టీవీకేను గెలిపిస్తానని, దళపతి విజయ్ ను సీఎం చేస్తానని ప్రకటించారు. పీకే చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. ప్రత్యేకించి తమిళ రాజకీయాలను షేక్ చేశాయి. ఈ సందర్బంగా సీఎస్కే స్కిప్పర్ ఎంఎస్ ధోనిని ప్రస్తావించారు.
తను చెన్నై సూపర్ కింగ్స్ ను ఐపీఎల్ లో విజేతగా నిలిపినట్లు తాను కూడా టీవీకేకు విజయాన్ని చేకూర్చేలా చేస్తానని చెప్పారు ప్రశాంత్ కిషోర్. ఇదే సమయంలో గత ఎన్నికల్లో తాను డీఎంకేను విజయ తీరాలకు చేర్చానని, ఈసారి విజయ్ భావజాలం నచ్చి తాను తనతో జత కట్టడం జరిగిందని చెప్పారు.
ఇదిలా ఉండగా బీహార్ లో జన్ సురక్ష పేరుతో పాదయాత్ర చేపట్టారు. ఆ తర్వాత దానిని రాజకీయ పార్టీగా ఏర్పాటు చేశాడు పీకే. తాను ఇక నుంచి ఆయా పార్టీలకు మద్దతు ఇవ్వబోనంటూ ప్రకటించి అందరినీ విస్తు పోయేలా చేశాడు. కానీ ఉన్నట్టుండి తమిళనాట కాలు మోపాడు. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. వస్తూ వస్తూనే గెట్ అవుట్ అనే ప్రచారానికి శ్రీకారం చుట్టాడు.
మరో వైపు ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు దళపతి విజయ్.