ఏపీలో జగన్ రెడ్డికి గడ్డుకాలం
ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ – భారత దేశ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ టీవీ ఛానల్ తో జరిగిన చిట్ చాట్ లో ఏపీ పాలిటిక్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఇదే సమయంలో తెలంగాణలో లోక్ సభ ఎన్నికల తర్వాత భారత రాష్ట్ర సమితి పార్టీ భవిష్యత్తు కూడా చెప్పలేమంటూ బాంబు పేల్చారు పీకే.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో కంటే ఇప్పుడు భిన్నంగా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. జగన్ మోహన్ రెడ్డి నవ రత్నాల పేరుతో డబ్బులు ఇచ్చినా జనం ఆయనను నమ్మే స్థితిలో లేరన్నారు ప్రశాంత్ కిషోర్.
జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని జోష్యం చెప్పారు. ప్యాలెస్‌లో కూర్చొని పథకాల పేరుతో డబ్బిస్తున్నామంటే ఓట్లు రాలవు అని అన్నారు. సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కూడా ముఖ్యమేనని తెలసుకోక పోవడం మైనస్ గా మారనుందని హెచ్చరించారు.
తెలంగాణలో కేసీఆర్ ఓటమికి కూడా అదే కారణమని విశ్లేషించారచు ప్రశాంత్ కిషోర్. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది ఓట్ల రూపంలో తేలనుందని అన్నారు. జగన్ ఏం చేసినా గెలవడం కష్టమేనని స్పష్టం చేశారు.