జగన్ రెడ్డికి ఓటమి తప్పదు
స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్
హైదరాబాద్ – ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఓ ఛానల్ తో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలు కాబోతున్నాడని చెప్పారు.
తన తల్లిని, స్వంత చెల్లెలిని నమ్మని జగన్ రెడ్డిని 5 కోట్ల మందికి పైగా ఉన్న జనం ఎలా నమ్ముతారంటూ ప్రశ్నించారు. చివరకు జగన్ రెడ్డి కోటరీ మొత్తం తల్లి, చెల్లిని టార్గెట్ చేయడం డ్యామేజ్ చేసేలా చేసిందన్నారు. చివరకు వారితో ఎవరైనా డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారంటూ ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు ప్రశాంత్ కిషోర్.
ఈసారి జరగబోయే ఎన్నికల్లో వైసీపీ గ్రాఫ్ పూర్తిగా పడి పోతుందన్నారు. 151 సీట్ల నుంచి 51 సీట్లకు పడి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు ఎన్నికల స్ట్రాటజిస్ట్. 2019లో ఎక్కడ మొదలు పెట్టాడో తిరిగి అక్కడికే జగన్ రెడ్డి రాబోతున్నాడంటూ పేర్కొన్నారు.
ఇక బోత్స సత్యనారాయణపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎవరి పక్కన ఉంటే వారిని మోసం చేశాడని, త్వరలోనే ఆయన టీడీపీలో చేర బోతున్నాడంటూ బాంబు పేల్చారు.