లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేదే విజయం
జోష్యం చెప్పిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్
బీహార్ – ప్రముఖ భారతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో దేశ వ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక (లోక్ సభ) ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం (ఎన్డీయే)నే తిరిగి అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఇండియా కూటమికి అంత సీన్ లేదన్నారు. భావ సారూప్యత లేకుండా కూటమి ఏర్పాటు కాదన్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైందని దీంతో ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. ప్రజలు సుస్థిరమైన పాలన కోరుకుంటున్నారని, ఆ దిశగా ఆలోచన చేస్తున్నారని అందుకే ఎన్డీయే కూటమి తిరిగి కొలువు తీరనుందని తెలిపారు. తాజాగా ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్స్ ఇండియా కూటమిలో కలకలం రేపుతున్నాయి.