NEWSNATIONAL

ప్ర‌శాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్

Share it with your family & friends

ఎన్నిక‌ల వ్యూహాల కోసం రూ. 100 కోట్లు

బీహార్ – జ‌న్ సుర‌క్ష పార్టీ చీఫ్ , ప్ర‌ముఖ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఎన్నిక‌ల వ్యూహాల కోసం క‌నీసం రూ. 100 కోట్లు ఫీజు కింద తీసుకుంటాన‌ని ప్ర‌క‌టించారు. ఇప్పుడు పీకే చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

దేశంలోని వివిధ రాష్ట్రాల‌లో ప‌ది ప్ర‌భుత్వాలు త‌న వ్యూహాల‌తో న‌డుస్తున్నాయ‌ని అన్నారు. ఆదివారం ప్ర‌శాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. ఇక త‌న పార్టీ ప్ర‌చారం కోసం, పందిరి వేసేందుకు త‌న వ‌ద్ద త‌గినంత డ‌బ్బులు లేవ‌ని అనుకుంటే ఎలా అని ప్ర‌శ్నించారు.

రాబోయే రెండు సంవ‌త్స‌రాల‌లో తాను అలాంటి ఎన్నిక‌ల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో , వ్యూహాల‌తో త‌న ప్ర‌చారానికి అత్య‌ధికంగా నిధుల‌ను స‌మ‌కూర్చుకునే స‌త్తా త‌న‌కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌శాంత్ కిషోర్.

మీరు అనుకుంటున్న‌ట్లు బీహార్ లో జ‌న్ సుర‌క్ష పార్టీ సంచ‌ల‌నం సృష్టించ బోతోంద‌ని ప్ర‌క‌టించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. అందుకే ఈసారి జ‌రిగే ఉప ఎన్నిక‌లో రిటైర్డ్ పోలీస్ ఆఫీస‌ర్ ను నియ‌మించ‌డం జ‌రిగింద‌న్నారు ప్ర‌శాంత్ కిషోర్. ఏది ఏమైనా ఒక పార్టీ త‌న‌తో ప‌ని చేయించు కోవాలంటే క‌నీసం రూ. 100 కోట్లు ఉండాల‌న్న‌మాట‌.