NEWSNATIONAL

చంద్ర‌బాబు ప్రాధేయ ప‌డ్డారు

Share it with your family & friends


పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్
న్యూఢిల్లీ – ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌ను బీహార్ దొంగ అంటూ విమ‌ర్శించాడ‌ని అన్నారు. ఓ జాతీయ ఛాన‌ల్ తో జ‌రిగిన చిట్ చాట్ లో ప్ర‌శాంత్ కిషోర్ మాట్లాడారు. ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. చంద్ర‌బాబు నాయుడు దిగ‌జారు రాజ‌కీయాల‌కు పాల్ప‌డడంలో సిద్ద‌హ‌స్తుడ‌ని పేర్కొన్నారు.

ఇందులో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశారు టీడీపీ చీఫ్ పై. ఒక‌నాడు త‌న‌ను దూషించిన చంద్ర‌బాబు నాయుడు తిరిగి త‌న స‌హాయం కోసం కోర‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు ప్ర‌శాంత్ కిషోర్. విచిత్రం ఏమిటంటే త‌న‌ను దూషించిన నోళ్లే తిరిగి త‌న‌ను పొగుడుతున్నాయంటూ పేర్కొన్నారు.

అంతే కాదు చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు రాజ‌కీయంగా తిరిగి బ‌లోపేతం చేసేందుకు స‌హాయం చేయాల‌ని ప్రాధేయ ప‌డ్డాడ‌ని చెప్పారు. గ‌తంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ బాస్ , ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌వ‌ర్ లోకి రావ‌డానికి తాను దోహ‌ద ప‌డింది వాస్త‌వ‌మేన‌ని పేర్కొన్నారు.

భార‌త దేశంలో పేరు పొందిన అన్ని పార్టీల‌కు చెందిన వారంతా త‌న‌ను సంప్ర‌దించిన మాట వాస్త‌వ‌మేన‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్.