రాహుల్ పై పీకే సెటైర్స్
ఆయనకు జిల్లాల పేర్లు తెలియవు
బీహార్ – ప్రముఖ రాజకీయ వ్యూహకర్త , ఐ ప్యాక్ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదన్నారు. ఇన్నాళ్లుగా రాష్ట్రాన్ని నాశనం చేసింది ఆ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ఆదివారం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు.
ఆయన ప్రధానంగా ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. అసలు బీహార్ సర్కార్ లో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జనానికి ఏం మేలు చేసిందో చెప్పగలదా అని ప్రశ్నించారు.
తనంతకు తానుగా లీడర్ గా భావించుకుంటున్న రాహుల్ గాంధీకి బీహార్ లోని నాలుగు జిల్లాల పేర్లు అయినా చెప్పగలడా అని సెటైర్ వేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మడం లేదన్నారు ప్రశాంత్ కిషోర్. ఆ విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. పొద్దస్తమానం ప్రధాన మంత్రి మోదీని, బీజేపీని విమర్శించడం తప్ప రాహుల్ గాంధీ చేస్తున్నది ఏమిటి అని అన్నారు.
ఈ దేశం కోసం తమ పార్టీ ఏం చేస్తుందో చెప్పగలిగే స్థితిలో ఉండాలన్నారు. లేక పోతే కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందన్నారు పీకే.