2029లో తెలంగాణ సీఎం కావడం ఖాయం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఢోకా లేదని స్పష్టం చేశారు ప్రముఖ జ్యోతిష్య పండితుడు ప్రశాంత్ కిని. ఆదివారం ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జాతకం బాగుందని, ఆయన ప్రస్థానం మరింత ముందుకు వెళుతుందని పేర్కొన్నారు.
అయితే జాతక రీత్యా చూస్తే రాహు దశ కుజుడు అంతర్దశ ప్రారంభం కావడంతో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన జాతకంలో కుజుడు రాహువు నుండి 12వ స్థానంలో ఉన్నాడని పేర్కొన్నారు ప్రశాంత్ కిని.
ఈ ఏడాది 2024 సెప్టెంబర్ మాసం నుండి కేసీఆర్ కు గురు దశ ప్రారంభం అయ్యిందని స్పష్టం చేశారు. కాగా వచ్చే 2026 అక్టోబర్ నెలలో కొంత అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇక కేసీఆర్ అదృష్టం , యోగం 2027 జనవరి తర్వాత మారనుందని ఆ తర్వాత కేసీఆర్ కు ఎదురే లేకుండా పోతుందని స్పష్టం చేశారు ప్రశాంత్ కిని .
2024 నుంచి 2029 దాకా చూసుకుంటే 2029 కేసీఆర్ కు సంబంధించి అత్యద్భుతమైన సంవత్సరం అని కుండ బద్దలు కొట్టారు జ్యోతిష్య పండితుడు. ప్రశాంత్ కిని చేసిన వ్యాఖ్యలతో గులాబీ నేతలు, శ్రేణుల్లో సంతోషం వ్యక్తం అవుతోంది.