నాలుగు రాష్ట్రాలలో బీజేపీకి కష్టమే – పీకే
జన సురాజ్ పార్టీ అధ్యక్షుడు కామెంట్స్
బీహార్ – ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ , జన సురాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన జాతీయ మీడియాతో పాట్నాలో మాట్లాడారు ప్రస్తుతం దేశంలోని నాలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం శాసన సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మా, భారతీయ జనతా పార్టీ తో కూడిన సంకీర్ణ సర్కార్ కు గడ్డుకాలమేనని సీరియస్ కామెంట్స్ చేశారు ప్రశాంత్ కిషోర్.
‘మోదీ జీ, ఎన్డీయే ప్రభుత్వానికి ఆదరణ, శక్తి తగ్గి పోయిందని స్పష్టం అవుతోందని, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా సహా 9 రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలపై ఆయుష్షు ఆధారపడి ఉంటుందని జన్ సూరాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ అన్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్, బీహార్‌లో వచ్చే సంవత్సరాలలో ఫలితాలు బిజెపికి వ్యతిరేకంగా వస్తే, ఈ రాష్ట్రాల్లో బిజెపి మంచి పని తీరును కనబరిచినా బీహార్ లో సీఎం నితీశ్ కుమార్ ను పదవి నుండి తొలగించ లేరంటూ కుండ బద్దలు కొట్టారు జన సురక్షా పార్టీ చీఫ్.
ఈ ఎన్నికల్లో వారు గెలవరని తెలుసు ..కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నితీశ్ సహకారం అత్యంత అవసరమని పేర్కొన్నారు. మొత్తంగా ప్రశాంత్ కిషోర్ చేసిన ఈ వ్యాఖ్యలు కాషాయ దళంలో కలకలం రేపుతున్నాయి.