ఐర్లాండ్ పై సెన్సేషన్ సెంచరీ రికార్డ్
హైదరాబాద్ – భారత మహిళా క్రికెట్ వన్డే ఫార్మాట్ లో అరుదైన రికార్డ్ నమోదు చేసింది ప్రతీకా రావల్. రాజ్ కోట్ వేదికగా ఐర్లాండ్ తో జరిగిన కీలకమైన వన్డే మ్యాచ్ లో 5 వికెట్లు కోల్పోయి 435 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది అత్యధిక స్కోర్ నమోదు కావడం విశేషం.
ముంబై స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన ఫాస్టెస్ట్ సెంచరీ సాధించింది. కేవలం 70 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మంధాన 12 ఫోర్లు 7 సిక్సర్లతో రెచ్చి పోయింది. 135 పరుగులు చేసి వెనుదిరిగింది. ఇక ప్రతీకా రావల్ ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఆకాశమే హద్దుగా చెలరేగింది. కేవలం 129 బంతులు మాత్రమే ఎదుర్కొని 154 రన్స్ చేసింది.
స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఉన్న మంధానతో కలిసి ప్రతీకా రావల్ 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇక ప్రతీకా రావల్ పుట్టింది ఢిల్లీలో. సెప్టెంబర్ 1, 2000లో పుట్టిన ఆమె వయసు 24 ఏళ్లు. రైల్వేస్ తరపున దేశీయ క్రికెట్ ఆడుతోంది. ఆమె తండ్రి ప్రముఖ అంపైర్ ప్రదీప్ రావల్. బీసీసీఐ సర్టిఫైడ్ లెవల్ -2 అంపైర్ గా కొనసాగుతున్నారు.
క్రికెట్‌తో పాటు ప్రతీకా రావల్ రాజేందర్ నగర్‌లోని బాల భారతి స్కూల్ తరపున బాస్కెట్‌బాల్ కూడా ఆడి, జనవరి 2019లో ఢిల్లీలో జరిగిన 64వ స్కూల్ నేషనల్ గేమ్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది.
ఆమె మొదట రోహ్‌తక్ రోడ్ జింఖానా క్రికెట్ అకాడమీలో కోచ్ శర్వన్ కుమార్ మార్గ దర్శకత్వంలో శిక్షణ పొందింది. గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.
తన తొలి వన్డేలో 40 పరుగులు చేసి, మంధానతో కలిసి 110 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకుంది. అదే మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ హెయిలీ మాథ్యూస్‌ను అవుట్ చేస్తూ ఆమె తన తొలి వన్డే వికెట్‌ను తీసింది.