ఏపీ సీఎం సంచలన నిర్ణయం
అమరావతి – ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రవీణ్ ఆదిత్యను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆదిత్య ఏపీ మార్ టైం బోర్డు సీవోగా పని చేస్తున్నారు. తాజాగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది.
ఇప్పటికే చైర్మన్ గా ను ఉన్న జీవీ రెడ్డి నిన్న తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ పని చేసిన ఎండీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో తాను టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రిజైన్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కేవలం వ్యక్తిగత కారణాల తోనే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు జీవీ రెడ్డి. ఆయన గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టీడీపీకి వాయిస్ గా ఉన్నారు. అనేకసార్లు ఆధారాలు, అంకెలతో సహాయ ఎండగట్టారు. ఒక రకంగా సర్కార్ ను డ్యామేజ్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
తను న్యాయవాది. అంతే కాకుండా పార్టీ కోసం నిబద్దతతో పని చేశారు. ఇదే సమయంలో తన పనితీరును మెచ్చిన చంద్రబాబు ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు చైర్మన్ గా నియమించారు. వచ్చీ రావడంతోనే కీలక సంస్కరణలు తీసుకు వచ్చారు. అంతే కాకుండా అక్రమంగా నియమితులైన 500 మందిపై వేటు వేశారు. ఎండీపై నిప్పులు చెరిగారు. దీంతో చంద్రబాబు, లోకేష్ తనను తిట్టడంతో తట్టుకోలేక తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది.