యూపీఎస్సీ చైర్మన్ గా ప్రీతీ సుదాన్
నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీ – యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నూతన చైర్మన్ గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతీ సుదాన్ నియమితులయ్యారు. ఆమె ఆగస్టు 1న చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇదిలా ఉంగా 75 ఏళ్ల స్వత్రంత భారత దేశంలో అత్యున్నతమైన వ్యక్తులను సివిల్స్ కు ఎంపిక చేసిన చరిత్ర యూపీఎస్సీకి ఉంది. దానిపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. దీంతో యూపీఎస్సీ చైర్మన్ గా మనోజ్ సోనీ తనంతకు తానుగా ఇంకా ఐదేళ్ల పాటు పదవీ కాలం ఉన్నప్పటికీ తప్పుకున్నారు. ఈయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆప్తుడిగా పేరు పొందాడు. రెండు సార్లు వీసీగా పని చేశారు.
ఆయనను చైర్మన్ గా ఎంపిక చేయడాన్ని అప్పట్లో లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పు పట్టారు. ప్రతిపక్షాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయినా పట్టించు కోలేదు మోడీ . చివరకు ఆయనపై కూడా తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మొత్తంగా నిజాయితీగా, నిబద్దతకు పేరు పొందిన యూపీఎస్సీ చివరకు అభాసు పాలైంది సోనీ నిర్వాకం కారణంగా.
ఇదిలా ఉండగా చైర్మన్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు ప్రీతీ సుదాన్ కు ఛాన్స్ ఇచ్చారు ప్రధానమంత్రి మోడీ.