దిల్ సే చిత్రాన్ని మరిచి పోలేను
ప్రముఖ నటి ప్రీతి జింతా కామెంట్
ముంబై – ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింతా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా తన సినీ కెరీర్ లో మరిచి పోలేని చిత్రం ఏదైనా ఉందంటే అది దిల్ సే అని పేర్కొన్నారు. దిగ్గజ దర్శకుడు మణి రత్నం తీశారు. ఇన్నేళ్లు అయినా ఎల్లప్పటికీ తనకు గుర్తుకు వచ్చేది ఈ మూవీ అని స్పష్టం చేశారు.
కొత్తగా మణిరత్నం సార్ తో పని చేయాలంటే భయ పడ్డానని తెలిపారు. ట్విట్టర్ వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు నటి ప్రీతి జింతా. ఈ సందర్బంగా షూటింగ్ ప్రారంభం కాగానే తన పరిస్థితిని చూసి దర్శకుడు కీలక సూచనలు చేశారని తెలిపారు. ఆయన సహచర్యంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు.
అంతే కాదు దిల్ సే సినిమాలో నన్ను నేను చూసుకుని నమ్మలేక పోయానని పేర్కొన్నారు నటి ప్రీతి జింతా. ఈ క్రెడిట్ మణిరత్నంతో పాటు ప్రముఖ ఛాయా గ్రహకుడు (కెమెరామెన్ ) సంతోష్ శివన్ కు దక్కుతుందన్నారు.
ఏది ఏమైనా తన సినీ కెరీర్ లోనే కాదు బాలీవుడ్ లో దిల్ సే అద్భుతమైన చిత్రం ఎల్లప్పటికీ నిలిచి పోతుందని స్పష్టం చేశారు ప్రీతి జింతా.