ప్రెసిడెంట్..ప్రధానమంత్రి వైరల్
దసరా పండుగ రోజు సెన్సేషన్
ఢిల్లీ – విజయ దశమి పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు ప్రజలంతా. అమ్మ వారిని దర్శించు కోవడం, పూజలు చేయడంతో కోలాహలంగా మారింది. దుర్గాష్టమిని పురస్కరించుకుని దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ పాల్గొన్నారు.
దేశ రాజధాని రాంలీలా మైదానంలో సాంప్రదాయాలకు ప్రసిద్ది చెందింది. సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసింది. ఈ సందర్బంగా మోడీ, ముర్ము విల్లులను ధరించి బాణాలను విడవడం మరింత ఆకట్టుకునేలా చేసింది.
ఈ సందర్బంగా జాతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు దేశ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. నీతి, న్యాయం, ధర్మం ఎల్లప్పటికీ నిలిచే ఉంటుందన్నారు . అధర్మంపై ధర్మం చేసిన యుద్దమే ఈ దసరా పండుగ అని పేర్కొన్నారు.
అనంతరం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. 143 కోట్ల మంది భారతీయులకు శుభాకాంక్షలు. జనులంతా సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరారు. దుర్గామాత చల్లంగా చూడాలని, భారత దేశం అన్ని రంగాలలో అభివృద్దిని సాధించాలని ఆకాంక్షించారు నరేంద్ర మోడీ.