పూరీ సముద్ర తీరం వెంట ప్రెసిడెంట్
ఒడిశా – ప్రసిద్ద పుణ్య క్షేత్రం ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథ యాత్ర నభూతో నభవిష్యత్త అన్న రీతిలో కొనసాగింది. ఇవాళ కూడా ఈ యాత్ర చేపట్టనున్నారు. లక్షలాది మంది ఇసుక వేస్తే రాలనంత భక్తులు పోటెత్తారు జగన్నాథుడి రథ యాత్రలో పాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారీ ఎత్తున ఏర్పాట్లను చేశారు.
ఈ సందర్భంగా ప్రసిద్ద క్షేత్రం పూరిలో ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని సందర్శించారు ద్రౌపది ముర్ము. తన అనుభవాలను , అనుభూతిని పంచుకున్నారు. ప్రకృతిని మించిన దైవం లేదన్నారు. దానితో నిత్యం మమేకం కావాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అభిప్రాయపడ్డారు.
పర్వతాలు, అడవులు, నదులు , సముద్ర తీరాలు మనలోని లోతైన వాటిని ఆకర్షిస్తాయని పేర్కొన్నారు.. తాను సముద్ర తీరం వెంబడి నడుస్తున్నప్పుడు చెప్పలేని సంతోషానికి లోనైనట్లు తెలిపారు ప్రెసిడెంట్. ఇదే సమయంలో జగన్నాథుడిని దర్శించుకున్న సమయంలోనూ అంతులేని ఉద్విగ్నతకు లోనైనట్లు తెలిపారు .