ప్రాతః స్మరణీయుడు మన్మోహన్ సింగ్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కామెంట్
ఢిల్లీ – మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అజాత శత్రువు అని కొనియాడారు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. సింగ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేశ చరిత్ర గతిని మార్చిన నేతలలో తను కూడా ఒకరు అని పేర్కొన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. సింగ్ నిత్య ప్రాతః స్మరణీయుడంటూ కితాబు ఇచ్చారు.
అంతకు ముందు డాక్టర్ మన్మోహన్ సింగ్ కు నివాళులు అర్పించారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్ , అమిత్ చంద్ర షా, జేపీ నడ్డాతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎంపీలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, శశి థరూర్ నివాళులు అర్పించారు.
వీరితో పాటు హిమాచల్ ప్రదేశ్ సీఎం, తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు , ఎంకే స్టాలిన్ అంజలి ఘటించారు. జాతి గర్వించదిగన నేతలలో మన్మోహన్ సింగ్ ఒకరు అంటూ పేర్కొన్నారు సీఎం స్టాలిన్.
చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు అన్నారు. లెక్చరర్ నుంచి ప్రధాని వరకు ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. భారత నిర్మాణంలో మన్మోహన్ సింగ్ ది కీలక పాత్ర అని ప్రశంసలు కురిపించారు. ఆయనతో తనకు ఉన్న బంధాన్ని నెమరు వేసుకున్నారు. గొప్ప వ్యక్తి అంటూ కితాబు ఇచ్చారు.