Friday, April 11, 2025
HomeNEWSNATIONALఓటు వేసిన ప్రెసిడెంట్ ముర్ము

ఓటు వేసిన ప్రెసిడెంట్ ముర్ము

కేంద్ర మంత్రి ఎస్ జై శంక‌ర్

ఢిల్లీ – ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ ప్రారంభ‌మైంది. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, కేంద్ర మంత్రి ఎస్. జై శంక‌ర్ త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఓట్లు వేసేందుకు ఢిల్లీ వాసులు బారులు తీరారు. మొత్తం 70 స్థానాల‌కు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 699 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. 13 వేల 766 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు. 1.56 కోట్ల మంది త‌మ ఓటు హ‌క్కు వినియోగించ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా 3 వేల స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ బూత్ ల‌ను గుర్తించారు. భారీ ఎత్తున బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఈసారి భారీ ఎత్తున పోలీస్ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఎన్నిక‌ల విధుల్లో ఏకంగా 35 వేల మంది పోలీసులు పాల్గొంటున్నారు.

ఢిల్లీలోని ప‌లు ప్రాంతాల‌లో డ్రోన్ల‌తో ప‌ర్య‌వేక్షిస్తున్నారు ఎన్నిక‌ల స‌ర‌ళిని. టెక్నాల‌జీ మార‌డంతో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఈ ఎన్నిక‌ల ఏర్పాట్ల‌ను ప్ర‌త్యేకంగా ప‌రిశీలిస్తోంది. ఇదిలా ఉండ‌గా ఈనెల 8న ఓట్లను లెక్కించ‌నున్నారు. అదే రోజు ఫ‌లితాలు వెల్ల‌డిస్తారు. అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ఢిల్లీ పోలీస్ యంత్రంగా గ‌ట్టి చ‌ర్య‌లు చేప‌ట్టింది.

ఈసారి ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న ఆప్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్య‌ర్థులు బ‌రిలో నిలిచారు. ఇండిపెండెట్లు కూడా పోటీ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments