21న లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగం
లోక్ సభలో 20న మోడీ బల నిరూపణ
న్యూఢిల్లీ – దేశంలో కొత్తగా కొలువు తీరిన మోడీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 21న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కీలక ప్రకటన చేసింది. ఇదిలా ఉండగా ఈనెల 20న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన బలాన్ని నిరూపించు కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి అవసరమైన 295 సభ్యుల మద్దతు ఉందని , ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రపతికి లేఖ సమర్పించారు పీఎం.
ఇప్పటికే ఆయనకు మద్దతు ఇస్తూ భాగస్వామ్య పక్షాల నేతలు సంతకాలతో కూడిన లేఖలను అందజేశారు. ఇదిలా ఉండగా మోడీ తన కేబినెట్ లో కొత్త, పాతకు చెందిన ఎంపీలను ఎంపిక చేశారు. మొత్తం 72 మందికి చోటు కల్పించారు.
ఇదిలా ఉండగా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలంతా ఈనెల 18, 19వ తేదీలలో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రపతి ప్రసంగం ఉండడంతో సభ్యులు హాజరుకానున్నారు.