NEWSNATIONAL

మీడియా మొఘ‌ల్ రామోజీ రావు

Share it with your family & friends

ప్రెసిడెంట్ ద్రౌప‌ది ముర్ము సంతాపం

న్యూఢిల్లీ – మీడియా, వినోద రంగంలో చెరుకూరి రామోజీ రావు మొఘ‌ల్ అంటూ కొనియాడారు దేశ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము. శ‌నివారం తుది శ్వాస విడిచారు. ఈ సంద‌ర్బంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ఆయ‌న లేని లోటు తీర్చ లేనిద‌ని పేర్కొన్నారు. ఆయ‌న మ‌ర‌ణం బాధాక‌రం. భార‌తీయ మీడియాను విప్ల‌వాత్మ‌కంగా మార్చిన దార్శ‌నికుడ‌ని కొనియాడారు. మీడియా ప‌రంగానే కాకుండా చ‌ల‌న చిత్ర ప్ర‌పంచంపై చెర‌గ‌ని ముద్ర వేశారంటూ ప్ర‌శంసించారు ముర్ము.

తెలుగు వారికే కాకుండా దేశానికి కూడా తీర‌ని లోటు అని వాపోయారు. మీడియా చీఫ్ గా, నిర్మాత‌గా 50కి పైగా సినిమాలు తీయ‌డం విశేష‌మ‌ని తెలిపారు. యూనివ‌ర్స‌ల్ స్టూడియో నిర్మించ‌డం మామూలు విష‌యం కాద‌న్నారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుడిని కోరుకుంటున్న‌ట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా రామోజీ సంస్థ‌ల చైర్మ‌న్ రామోజీరావు పూర్తి పేరు చెరుకూరి రామ‌య్య‌. 1974లో ఈనాడు ప‌త్రిక‌ను విశాఖ ప‌ట్ట‌ణంలో ప్ర‌ముఖ పాత్రికేయుడు , సంపాద‌కుడు ఏబీకే ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో ప్రారంభించారు.

చెరుకూరి రామోజీ రావు స్వ‌స్థ‌లం ఆంధ్ర‌ప్రేద‌శ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా. 16 న‌వంబ‌ర్ 1936లో పుట్టారు. భార‌త దేశంలో మీడియా మొఘ‌ల్ గా పేరు పొందారు.