కోల్ కతా నైట్ రైడర్స్ కు చుక్కలు
మల్లాన్ పూర్ – ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో అద్భుతం చోటు చేసుకుంది. కీలకమైన లీగ్ మ్యాచ్ లో ఊహించని రీతిలో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమి పాలైంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ ను ఛేదించలేక పోయింది. 112 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ కేవలం 95 రన్స్ కే పరిమితమైంది. ముంబైకి చెందిన యుజ్వేంద్ర చాహల్ తన స్పిన్ మాయజాలంతో మ్యాజిక్ చేశాడు. ఏకంగా 4 వికెట్లు తీశాడు. కోల్ కతా పతనాన్ని శాసించాడు. కళ్లు చెదిరే బంతులతో పరేషాన్ చేయడంతో అందరూ పెవిలియన్ బాట పట్టారు. ఈ సందర్బంగా జట్టుకు గెలుపు అందించిన చాహల్ ను ఆనందంతో హత్తుకుంది పంజాబ్ ఎలెవన్ ఓనర్ ప్రీతి జింతా.
ఇదిలా ఉండగా లీగ్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠను రేపింది పంజాబ్స్ కింగ్స్ ఎలెవన్ , కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్. అత్యల్ప స్కోర్ ను ఛేదించే క్రమంలో బోర్లా పడింది కేకేఆర్. టాప్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కమాల్ చేశాడు. గెలవదని డిసైడ్ అయిన క్రమంలో మ్యాచ్ ను పూర్తిగా మార్చేశాడు. పంజాబ్ కు అపూర్వమైన విజయాన్ని కట్టబెట్టడంలో కీలక రోల్ పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు 4 వికెట్లు తీసి. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 111 పరుగులకే పరిమితమైంది. బరిలోకి దిగిన కోల్ కతా 95 పరుగులకు ఆలౌటైంది. 16 రన్స్ తేడాతో ఓడి పోయింది.