ప్రియదర్శితో ఇంద్రగంటి మూవీ
జంటగా రూప కొడువాయూర్
హైదరాబాద్ – కొద్ది కాలంలోనే పేరు పొందాడు, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రియదర్శి. వేణు దర్శకత్వం వహించిన బలగం మూవీ అతడిని మరింత చేరువ చేసింది. ఇదే సమయంలో సేవ్ టైగర్స్ వెబ్ సీరీస్ సమ్మోహన పరిచేలా చేసింది. తాజాగా ప్రముఖ విలక్షణ దర్శకుడిగా పేరొందిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నటించే ఛాన్స్ కొట్టేశాడు ప్రియదర్శి. ఆయనతో పాటు జంటగా రూప కొడువాయూర్ నటిస్తోంది.
ఇదిలా ఉండగా 2016లో నానితో జెంటిల్ మెన్ తీశాడు మోహనకృష్ణ. 2018లో సుధీర్ బాబుతో సమ్మోహనం రూపొందించారు. ఇక ముచ్చటగా మూడోసారి శ్రీదేవి మూవీస్ కాంబినేషన్ లో ప్రారంభమైంది. ప్రియదర్శితో పాటు రూప ఇందులో హీరో హీరోయిన్లు కావడం విశేషం.
ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్బంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడారు.
అత్యంత ప్రతిభావంతుమైన మోహనకృష్ణతో మరో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో చక్కటి వినోదంతో పాటు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.