తలపతి 69లో ప్రియమణికి ఛాన్స్
విజయ్ తో నటించడం ఆనందంగా ఉంది
హైదరాబాద్ – తమిళ సినీ సూపర్ స్టార్ తలపతి విజయ్ ఆఖరి చిత్రం తలపతి 69 చిత్రానికి సంబంధించి అప్ డేట్ వచ్చింది. ఇప్పటికే కీలక పాత్రలలో ఎవరెవరు ఉంటారనే దానిపై ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
తాజాగా పూజా హెగ్డే, మమిత బైజుతో పాటు ప్రియమణి కూడా నటించనుందని ప్రకటించారు. ఇందులో హిందీ నటుడు బాబీ డియోల్ కూడా కీలక పాత్రలో నటించనుండడం విశేషం. తన రాజకీయ ఆకాంక్షలకు ముందు తన చివరి చిత్రం ఇదేనంటూ ప్రకటించాడు విజయ్.
దీంతో భారీ ఎత్తున ఫ్యాన్స్ ఈ చివరి చిత్రం పై అంచనాలు పెట్టుకున్నారు. వారి అంచనాలకు మించి ఈ సినిమా తీస్తానంటూ ప్రకటించాడు దర్శకుడు హెచ్ వినోత్. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో తలపతి 69 చిత్రాన్ని తెర కెక్కించే ప్రయత్నం జరుగుతోంది.
ఇటీవలే విజయ్ నటించిన విజయ్ ప్రభు తీసిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) బిగ్ సక్సెస్ అయ్యింది.
కేవీఆర్ ప్రొడక్షన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో బాబీ డియోల్ ను ప్రకటించారు. ఆ తర్వాత పూజా హెగ్డే కూడా చేరుతోందని తెలిపారు. అయితే తలపతి విజయ్ తో గతంలో విజయవంతమైన బీస్ట్ చిత్రంలో నటించారు. ఇది ఆమెకు సూపర్ స్టార్ తో రెండో సినిమా.