NEWSNATIONAL

మ‌లివాల్ కేసుపై ప్రియాంక కామెంట్స్

Share it with your family & friends

నిజం త్వ‌ర‌లోనే తేలుతుంద‌న్న ఎంపీ

మ‌హారాష్ట్ర – ఆప్ ఎంపీ స్వాతి మ‌లివాల్ పై జ‌రిగిన దాడి గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ఇండియా కూట‌మి లోని శివ‌సేన యూబీటీ నాయ‌కురాలు, ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది. ప్ర‌స్తుతం ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. విచార‌ణ కూడా చేప‌ట్టారు. వైద్య ప‌రీక్ష‌లు చేప‌ట్టారు. సీఎం వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు త‌న‌పై దాడికి పాల్ప‌డ్డారంటూ బాధితురాలు ఫిర్యాదు చేసింద‌న్నారు.

అస‌లు వాస్త‌వాలు ఏమిటో ఇంకా తెలియ‌దు. దాని గురించి ముంద‌స్తు వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాదు అన్నారు ప్రియాంక చ‌తుర్వేది. ముందు సీఎం నివాసంలో ఏం జ‌రిగింద‌నేది ఆప్ అధికారికంగా సీసీ టీవీ ఫుటేజ్ తో కూడిన వీడియోను విడుద‌ల చేసింద‌న్నారు.

దానిలో ఎలాంటి దాడికి గురైన స‌న్నివేశాలు లేవు. కానీ లోప‌ట ఏం జ‌రిగింద‌నేది బాధితురాలిని అడిగితే , విచార‌ణ చేప‌డితే తేలుతుంద‌న్నారు. ఇప్ప‌టికే సీఎం స‌హాయ‌కుడు కుమార్ ను అదుపులోకి తీసుకున్నార‌ని , కూట‌మిలో ఎవ‌రు ఉన్నా లేక పోయినా ఏం జ‌రిగింద‌నేది త్వ‌ర‌లో తేలుతుంద‌న్నారు.