రాహుల్ ను అడ్డుకోవడం దారుణం
ఎంపీ ప్రియాంక చౌదరి కామెంట్స్
న్యూఢిల్లీ – ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో పదే పదే అడ్డుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు శివసేన యుబిటి ఎంపీ ప్రియాంక చతుర్వేది . సోమవారం ఆమె ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. అసలు ఈ దేశంలో ప్రజా స్వామ్యం అన్నది ఉందా అన్న అనుమానం కలుగుతోందన్నారు.
నిన్నటి దాకా సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని ఆధిపత్యం చెలాయించారని, ఇవాళ మైనార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇదే తీరును ప్రతిపక్ష సభ్యుల పట్ల ప్రదర్శించడం మంచి పద్దతి కాదన్నారు ప్రియాంక చతుర్వేది.
పదే పదే రాహుల్ గాంధీ చెప్పింది వినిపించు కోకుండా అడ్డుకోవడాన్ని తాను తీవ్రంగా తప్పు పడుతున్నట్లు తెలిపారు. అసలు స్పీకర్ నియంత్రించాల్సింది పోయి తాను కూడా విపక్షాలకు వ్యతిరకంగా సభను నిర్వహించడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు శివసేన యుబిటి నాయకురాలు.