చిల్కూరును సందర్శించిన బాలీవుడ్ నటి
హైదరాబాద్ – ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో బిజీగా ఉన్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు పక్కన కీ రోల్ లో నటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె ప్రముఖ క్షేత్రంగా వినుతికెక్కిన రంగారెడ్డి జిల్లా చిల్కూరు బాలాజీ ఆలయంలో ప్రత్యక్షం అయ్యారు. పూజారులు ఆమెకు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇదిలా ఉండగా ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ కు మకాం మార్చేశారు. తను ప్రస్తుతం అమెరికాలో స్థిర పడ్డారు. తనకంటే చిన్న వాడైన నటుడి ప్రేమలో పడింది. తనతో పెళ్లి చేసుకున్నాక అక్కడే స్థిర పడింది. ఇటు బాలీవుడ్ అటు హాలీవుడ్ లో నటిస్తోంది ప్రియాంక చోప్రా.
చాలా గ్యాప్ తర్వాత తెలుగు చిత్రంలో నటిస్తుండడం విశేషం. ఎస్ఎస్ రాజమౌలి అంటేనే దిగ్గజ దర్శకుడిగా గుర్తింపు పొందారు. ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ దర్శకులలో తను కూడా ఒకడిగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజతో తీసిన ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ బాబుతో వస్తున్న చిత్రం పై ఫుల్ ఫోకస్ కొనసాగుతోంది.