దేశ భవిష్యత్తు కోసం ఓటేయండి
పిలుపునిచ్చిన ప్రియాంక గాంధీ
న్యూఢిల్లీ – ఈ దేశం ప్రమాదంలో ఉంది. కులం పేరుతో మతం పేరుతో మనుషుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి పదేళ్లుగా పాలన సాగిస్తూ వచ్చారు. ఇకనైనా ప్రజలు మారక పోతే రేపటి భవిష్యత్తును కోల్పోవడం ఖాయమని హెచ్చరించారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. గతంలో కంటే ఇప్పుడు ప్రజలు తాము ఏం కోల్పోయారో తెలుసుకున్నారని విలువైన సమయం ఏదైనా ఉందంటే ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడమే మిగిలి లుందని పేర్కొన్నారు.
సోమవారం పోలింగ్ సందర్బంగా ట్విట్టర్ వేదికగా జాతిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓటు వేయడం అంటే మనం బాధ్యతతో వ్యవహరిస్తున్నట్లు లెక్క. మీరు వేసే ప్రతి ఓటు కీలకమైనదని గుర్తుంచు కోవాలని అన్నారు. లేక పోతే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు ప్రియాంక గాంధీ.
ఇప్పటి వరకు మూడు విడతల పోలింగ్ పూర్తయింది. ఇవాళ నాలుగో విడత కొనసాగుతోంది. సెలవు ఉంది కదా అని ఇళ్లల్లో కూర్చోకుండా బాధ్యతాయుతమైన పౌరులుగా భావించి విలువైన ఓటు హక్కు వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు. ఓటు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షిస్తుందని తెలుసు కోవాలని సూచించింది.