ఓటు వేసిన ప్రియాంక గాంధీ
6వ విడత పోలింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శనివారం న్యూఢిల్లీలో 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. ఈ సందర్బంగా ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, తనయుడు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ తమ విలువైన ఓటు వేశారు.
ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు అన్నది అత్యంత కీలకమని పేర్కొన్నారు ప్రియాంక గాంధీ. ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలతో కూడిన భారత కూటమికి విజయం తప్పదన్నారు ప్రియాంక గాంధీ. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
ఈ దేశం గతంలో ఎన్నడూ లేని రీతిలో తీవ్రమైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో కొట్టు మిట్టాడుతోందన్నారు. ఇందుకు తగిన మూల్యం బీజేపీ , మోడీ చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని , అది త్వరలోనే తేలి పోవడం ఖాయమని జోష్యం చెప్పారు ప్రియాంక గాంధీ.