వాయనాడులో ప్రియాంక నామినేషన్
ఉప ఎన్నికల బరిలో కాంగ్రెస్ నేత
కేరళ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం వాయనాడు పార్లమెంట్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆమె వెంట సోదరుడు, రాయ్ బరేలి ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తల్లి సోనియా గాంధీ కూడా హాజరయ్యారు.
ఈ సందర్బంగా భారీ ఎత్తున జనం ప్రియాంక గాంధీని చూసేందుకు వచ్చారు. భారీ జన సందోహం మధ్య ప్రియాంక గాంధీ తన నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ కు అందజేశారు.
ఈ సందర్బంగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడారు. పదవి ఉన్నా లేక పోయినా తాను ఏనాడూ ప్రజలకు దూరంగా లేనని అన్నారు. ఇదిలా ఉండగా తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు లోక్ సభ స్థానాల నుంచి బరిలో నిలిచారు రాహుల్ గాంధీ. ఒకటి వాయనాడు కాగా మరోటి రాయ్ బరేలి. ఈ రెండింటిలోను ఘన విజయాన్ని సాధించారు. చివరకు రాయ్ బరేలిని ఉంచుకుని వాయనాడును వదులుకున్నారు.
తన సోదరిని బలమైన అభ్యర్థిగా తన తరపున నిలబడుతుందని ప్రకటించారు. మద్దతు ఇవ్వాలని కోరారు.