మరాఠాలో ప్రియాంకకు జన నీరాజనం
అపూర్వమైన స్పందన అనూహ్య ఆదరణ
మహారాష్ట్ర – దేశంలో మోదీకి ఎదురు గాలి వీస్తున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటి వరకు సార్వత్రిక ఎన్నికల్లో మూడు దశల్లో పోలింగ్ ముగిసింది. జూన్ 4 తర్వాత ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతాయి. ప్రస్తుతం దేశంలో ప్రతిపక్షాలతో కూడిన భారతీయ కూటమికి భారతీయ జనతా పార్టీకి మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ఫైట్ నడుస్తోంది.
బీజేపీ పెద్ద ఎత్తున మోదీ మరోసారి వస్తారని ప్రచారం చేస్తున్నా గ్రౌండ్ లెవల్లో అందుకు భిన్నంగా కనిపిస్తోంది. రామ మందిరం , మోదీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలు ఏవీ కూడా గట్టెక్కించేలా కనిపించడం లేదు.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెద్ద ఎత్తున దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మోదీ ప్రచారానికే ప్రయారిటీ ఇస్తున్నా ఆశించిన మర తను కోరుకుంటున్నట్లు 400 సీట్లు రావడం అన్నది కలలో మాట అని ఇప్పటికే ప్రకటించారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.
రోజు రోజుకు రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతుండడం కూడా ఒకింత బీజేపీని ఆందోళన కలిగిస్తోంది. తాజాగా శనివారం మహారాష్ట్రలో నిర్వహించిన సభకు ఊహించని రీతిలో జనం హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.