ఎవరైనా సరే బాధితురాలి పక్షమే
ఏఐసీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఉత్తర ప్రదేశ్ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ పై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి.
స్వయంగా బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ సందర్బంగా స్వాతి మలివాల్ ను కోర్టులో హాజరు పర్చగా టెస్టులు చేయమని కోర్టు ఆదేశించింది. ఎయిమ్స్ లో పరీక్షలు చేయడం, గాయాలైనట్లు తేలడంతో సమస్య తీవ్రంగా మారింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బీభవ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ సందర్బంగా స్వాతి మలివాల్ పై జరిగిన దాడి గురించి స్పందించారు ప్రియాంక గాంధీ. ఎక్కడైనా ..ఏ పార్టీకి చెందిన వారైనా సరే మహిళపై ఏదైనా అఘాయిత్యం జరిగితే, తాము మహిళకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. తాను ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటానని చెప్పారు.