వాయనాడు ప్రజల గొంతుకనవుతా – ప్రియాంక
మీరు లేక పోతే ఈ దేశమే లేదన్న నాయకురాలు
కేరళ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాయనాడు లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి ప్రియాంక గాంధీ నామినేసన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన అతిరథ మహారథులు, నేతలు హాజరయ్యారు.
పార్టీ తరపున ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ , శశి థరూర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా నిర్వహించిన రోడ్ షోకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ఇదే సమయంలో నామినేషన్ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ప్రియాంక గాంధీ.
వాయనాడ్ ప్రాంతం, ప్రజల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. ఇదే సమయంలో మీరంతా కురిపిస్తున్న ప్రేమ, ఆశీస్సులు తీసుకుని ఉప ఎన్నికకు నామినేషన్ పత్రాన్ని సమర్పించానని చెప్పారు ప్రియాంక గాంధీ.
ఈ దేశానికి బలం అక్కడి ప్రజలే. వారిలో ఒకరిగా నేను వాయనాడ్ కోసం నా గొంతును పెంచడానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మీ దీవెనలు, ప్రేమ నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.