ప్రియాంక గాంధీ నామినేషన్ ఓకే
సంతోషం వ్యక్తం చేసిన ఏఐసీసీ
కేరళ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఊపిరి పీల్చుకున్నారు. ఆమె తన సోదరుడు రాజీనామా చేసిన కేరళ లోని వాయనాడు పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రస్తుతం ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ సందర్బంగా ఆమె పెద్ద ఎత్తున పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, అభిమానుల స్వాగతంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అవసరమైన అన్ని పత్రాలు సమర్పించారు.
సోమవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కీలక ప్రకటన చేశారు. ప్రియాంక గాంధీ అభ్యర్థిత్వానికి సంబంధించి ఎలాంటి తప్పులు లేవని, అందుకే ఓకే చేసినట్లు వెల్లడించారు. దీంతో ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ పెద్దలు సంతోషం వ్యక్తం చేశారు.
ఇక నెల రోజుల పాటు ఆమె వాయనాడులోనే ఉంటారు. పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నారు. తాడో పేడో తేల్చుకోనున్నారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల పోటీ చేశారు. ఒకటి వాయనాడు కాగా మరొకటి రాయ్ బరేలి. వాయనాడును వదులు కోవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.