వాయనాడు ప్రజలారా మీకు వందనం
ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక
ఢిల్లీ – వాయనాడు ఉప ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని కట్ట బెట్టినందుకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. తన సోదరుడు రాహుల్ గాంధీ కంటే అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
వాయనాడ్ లోని నా ప్రియమైన సోదరీమణులు, సోదరులారా అంటూ కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు ప్రియాంక గాంధీ. మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగి పోయానని తెలిపారు. కాలక్రమేణా ఈ విజయం మీ విజయమని మీరు నిజంగా భావిస్తున్నారని నేను నిర్ధారిస్తాను.
మీకు ప్రాతినిధ్యం వహించడానికి నన్ను ఎంచుకున్నందుకు ఎల్లవేళాలా రుణపడి ఉంటానని స్పష్టం చేశారు ప్రియాంక గాంధీ. మీరు అందించిన ఈ అద్భుత గెలుపుతో వాయనాడు తరపున ప్రజా గొంతును వినిపిస్తానని పేర్కొన్నారు.
నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీరు నాకు ఇచ్చిన అపారమైన ప్రేమకు అంటూ ప్రశంసలు కురిపించారు ప్రియాంక గాంధీ. యూడీఎఫ్ లోని సహద్యోగులు, కేరళలోని నాయకులు, కార్మికులు, వాలంటీర్లు, నేతలు, కార్యకర్తలు పేరు పేరునా అభినందనలు తెలియ చేస్తున్నట్లు తెలిపారు.
నా తల్లి సోనియా గాంధీ, భర్త రాబర్ట్ , నా ఇద్దరు పిల్లలు రెహాన్ , మిరాయా అందించిన మద్దతును మరిచి పోలేనని అన్నారు. అంతే కాకుండా తన గెలుపు కోసం కృషి చేసిన సోదరుడు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ను మరిచి పోలేనని స్పష్టం చేశారు ప్రియాంక గాంధీ.