ఆదివాసీల పాత్ర గొప్పది
వారు లేకుండా దేశం లేదు
ఛత్తీస్ గఢ్ – ఈ దేశ అభివృద్దిలో ముఖ్య భూమికను ఆదివాసీలు పోషిస్తున్నారని స్పష్టం చేశారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కోర్బాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ఆదివాసీలు ప్రకృతిని ఎంతో ప్రాణ ప్రదంగా చూసుకుంటారని తన నాయినమ్మ, దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తనకు చెప్పే వారని గుర్తు చేశారు. మీతో కలిసి ఇలా మాట్లాడు కోవడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఇవాళ దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.
మీకు సంబంధించిన విలువైన ఓటును పని చేసే వారికి వేయాలని సూచించారు ప్రియాంక గాంధీ. ఈ భూమి అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా తాను ఎంతో ఆనందానికి లోనవుతానని చెప్పారు.
దేశంలోని వివిధ రంగాలలో గొప్ప పాత్ర పోషించిన ఎందరో మహానుభావులు ఈ నేల నుండి వచ్చారని కొనియాడారు ప్రియాంకా గాంధీ.