ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి
న్యూఢిల్లీ – యావత్ భారతావని ప్రస్తుతం ఇండియా కూటమి వైపు చూస్తోందని స్పష్టం చేశారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆమె బిజీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆమె జాతీయ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ తో ప్రియాంక గాంధీ సంభాషించారు.
ఇంకెంత కాలం మాయ మాటలతో, అబద్దాలతో బీజేపీ పాలన కొనసాగుతుందని ప్రశ్నించారు. తమకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ఈ దేశానికి ఏం కావాలో ఏం చేయాలనేది తెలుసని చెప్పారు. ఇందులో అనుమానం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఇవాళ బీజేపీని నడిపిస్తున్నది ప్రధాని మోదీ అనుకుంటే పొరపాటు అని ఎద్దేవా చేశారు. పేరుకు పీఎం అయినా వెనుక నుండి నడిపిస్తున్నది అదానీ, అంబానీలేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. అందుకే ఈసారి మోదీని ఎవరూ నమ్మడం లేదన్నారు. ఆయన కావాలని తమపై అభాండాలు వేస్తున్నారని ఆవేదన చెందారు.
జనం పూర్తిగా డిసైడ్ అయి ఉన్నారని, దేశం మార్పు కోరుకుంటోందని, జూన్ 4 తర్వాత ఏమిటనేది మీరు చూస్తారని చెప్పారు ప్రియాంక గాంధీ.