ఛాన్స్ ఇస్తే మోదీ అమ్మేస్తారు
ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి
కేరళ – ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ
కేరళ లోని పతనంతిట్టలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
70 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటూ పదే పదే మోదీ ప్రశ్నిస్తున్నారని, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశామని, ప్రాజెక్టులను కట్టామని, విద్యా రంగానికి పెద్ద పీట వేశామని, ఆరోగ్య రంగానికి ఊతం ఇచ్చేలా చేశామన్నారు.
కానీ తను ప్రధానమంత్రి అయ్యాక మోదీ చేసింది ఏమీ లేదన్నారు. తన వ్యక్తిగత ప్రచారం చేసుకోవడం తప్ప, కొద్ది మంది వ్యాపారవేత్తలకు దేశానికి చెందిన వనరులను అప్పనంగా అప్పగించడం తప్పా దేశ అభివృద్ది కోసం ఏమైనా చేశారా అని నిప్పులు చెరిగారు ప్రియాంక గాంధీ. ఇంకోసారి గనుక ఛాన్స్ ఇస్తే కార్పొరేట్ శక్తులకు దేశాన్ని అమ్మేస్తాడని ధ్వజమెత్తారు.