NEWSNATIONAL

ప్ర‌జ‌ల‌కు దూర‌మైన ప్ర‌ధాని

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ

ఉత్త‌ర ప్ర‌దేశ్ – ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ సీరియ‌స్ కామెంట్స్ చేశారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఆమె యూపీలో కాంగ్రెస్ కూట‌మి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్రసంగించారు.

ఆమెతో పాటు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ , రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా పీఎంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయ‌న సంప‌న్నుల కోస‌మే ప‌ని చేస్తున్నార‌ని ఆరోపించారు. మోదీ వ‌ల్ల దేశానికి ఒరిగింది ఏమీ లేద‌ని భారం త‌ప్ప అని ఎద్దేవా చేశారు.

10 ఏళ్ల కాలంలో ఎన్నో అబ‌ద్దాలు చెప్పార‌ని, ఏ ఒక్క‌టీ చెప్పిన దానికి క‌ట్టుబ‌డి ఉండ‌లేద‌ని ఆరోపించారు ప్రియాంక గాంధీ. ఆయ‌న పూర్తిగా ప్ర‌జ‌ల నుంచి దూర‌మై పోయార‌ని, కేవ‌లం మాట‌ల‌తో నెట్టుకు వ‌స్తున్నాడంటూ మండిప‌డ్డారు.

దేశాన్ని 100 ఏళ్లు వెన‌క్కి వెళ్లేలా చేశాడ‌ని, ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను గంప గుత్త‌గా అమ్మేందుకు ప్ర‌య‌త్నం చేశాడే త‌ప్పా దేశం కోసం ఏ ఒక్క మంచి ప‌నీ చేయ‌లేద‌ని ఆవేద‌న చెందారు ప్రియాంక గాంధీ.