మోదీ మోసం కోటీశ్వరులకు లాభం
నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ
ఉత్తర ప్రదేశ్ – ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలు సభల్లో పాల్గొన్నారు. ప్రధానంగా మోదీపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేసే పనిలో పడ్డారు.
తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని అమేథీలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు. ఈ 10 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఏం చేశారో దేశానికి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయన పదే పదే కాంగ్రెస్ ఏం చేసిందని అడుగున్నారని, ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ పని కల్పించే జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని , సమాచారాన్ని తెలుసు కునేందుకు గాను జాతీయ సమాచార హక్కు చట్టాన్ని తీసుకు వచ్చామని అన్నారు.
సోయి లేకుండా మాట్లాడటం మోడీకే చెల్లిందని ఆరోపించారు ప్రియాంక గాంధీ. ఆహార భద్రతా బిల్లును కూడా తీసుకు వచ్చిన ఘనత తమదేనని పేర్కొన్నారు. ఇవాళ మోదీ దేశం కోసం ప్రధానిగా ఉండడం లేదని కేవలం నలుగురు లేదా ఐదుగురు కోటీశ్వరుల కోసం ఆయన పని చేస్తున్నారని ఆరోపించారు.