ప్రజల నేస్తం హస్తం – ప్రియాంక
మోసం చేసిన మోదీకి ఓటేయొద్దు
ఉత్తరప్రదేశ్ – ప్రజలకు సేవ చేయడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని స్పష్టం చేశారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీ లోని రాయ్ బరేలి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఉంచాహర్, ఉమ్రాన్ , అకోధియా ప్రాంతాలలో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.
జాతీయ ఉపాధి హామీ పథకం , సమాచార హక్కు చట్టంతో పాటు ఆహార హక్కు చట్టాన్ని తీసుకు వచ్చిందని చెప్పారు. ఆహార పథకం వల్ల ఇవాళ దేశంలోని కోట్లాది మంది ప్రజలకు రేషన్ అందుతోందని అన్నారను ప్రియాంక గాంధీ.
అంతే కాకుండా పిల్లలు చదువుకునేలా విద్యా హక్కు చట్టాన్ని తీసుకు వచ్చిన ఘనత తమదేనని అన్నారు. అయితే భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఇందుకు విరుద్దమని ఆరోపించారు. విద్య, వైద్యం కార్పొరేట్ పరం చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. పేదలు, సామాన్యులు, రైతులకు ఏమీ ఇవ్వకుండా వారిని మరింత నిస్సహాయులుగా మార్చడమే ఆ పార్టీ ముఖ్య ఉద్దేశమని మండిపడ్డారు.
నరేంద్ర మోడీ, బీజేపీ నేతల దృష్టి అంతా అధికారాన్ని తమ చేతిలో ఉంచు కోవడంపైనే ఉందన్నారు. ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలు ఇచ్చి ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టారని ఆరోపించారు.