NEWSNATIONAL

మోదీ దేశానికి చేసిందేమిటి..?

Share it with your family & friends

ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక

ఉత్త‌ర ప్ర‌దేశ్ – ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా జ‌రిగిన స‌భ‌లో ప్ర‌సంగించారు.

ప‌ది సంవ‌త్స‌రాల బీజేపీ పాల‌నా కాలంలో ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోదీ ఏం చేశారో చెప్పాల‌ని ఆమె నిల‌దీశారు. ఆయ‌న పాల‌నంతా పూర్తిగా అబ‌ద్దాల పునాదుల‌పై కొన‌సాగింద‌న్నారు ప్రియాంక గాంధీ. ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం పెరిగి పోయింద‌న్నారు. ఆయ‌న ఎప్పుడూ ప్ర‌జా స‌మ‌స్య‌ల గురించి ప్ర‌స్తావించిన పాపాన పోలేద‌న్నారు .

ఆయ‌న ప‌దే ప‌దే చేత కాక ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకు ప‌డ‌టం ప‌నిగా పెట్టుకున్నాడంటూ ధ్వ‌జ‌మెత్తారు ప్రియాంక గాంధీ. మంగ‌ళ సూత్రాల‌ను తీసుకుంటామ‌ని ప‌దే ప‌దే చెప్ప‌డం ఆయ‌న ఓట‌మిని ఒప్పుకున్న‌ట్ల‌వుతోంద‌ని పేర్కొన్నారు ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోదీ , కాషాయ పార్టీ ఓట‌మి పొంద‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.