గాడి తప్పిన మోడీ పాలన
నిప్పులు చెరిగిన ప్రియాంక
ఉత్తర ప్రదేశ్ – మోడీ సర్కార్ పాలన గాడి తప్పిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలో పర్యటించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశాన్ని సర్వ నాశనం చేసిన ఘనత ప్రధానమంత్రికి దక్కిందని ఆరోపించారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసి కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే లబ్ది చేకూర్చేలా చేశారంటూ నరేంద్ర మోడీపై మండిపడ్డారు. అబద్దాలు చెప్పడంలో ప్రపంచంలో ప్రధానిని మించిన వారు ఎవరూ లేరంటూ ఎద్దేవా చేశారు ప్రియాంక గాంధీ.
మోడీ పదే పదే 400 సీట్లు వస్తాయని అంటున్నారని, ఏ లెక్కన బీజేపీకి వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మోసం చేయడంలో , హామీలు ఇచ్చి అమలు చేయక పోవడంలో నెంబర్ వన్ గా నిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు .
సార్వత్రిక ఎన్నికల్లో భారత కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. బీజేపీ సంకీర్ణ సర్కార్ పనై పోయిందన్నారు ప్రియాంక గాంధీ.