మోదీ చెప్పేవన్నీ అబద్దాలే
ప్రియాంక గాంధీ కామెంట్
గుజరాత్ – ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం గుజరాత్ లోని బనస్కాంతలో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు.
నరేంద్ర మోదీ పదేళ్ల కాలంలో అబద్దాలు చెప్పడంతోనే కాల యాపన చేశాడని ఆరోపించారు. ప్రజలను నట్టేట ముంచారని, మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు ప్రియాంక గాంధీ. ఆచరణకు నోచుకోని హామీలతో జనాన్ని బురిడీ కొట్టించారంటూ ఫైర్ అయ్యారు.
తాను చేసిన తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకే తమ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం పనిగా పెట్టుకున్నారంటూ మోదీపై భగ్గుమన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. ఏడాదికి 2 కోట్ల జాబ్స్ ఇస్తానని చెప్పారని, ఇప్పటి వరకు 10 వేల జాబ్స్ కూడా పట్టుమని భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు ప్రియాంక గాంధీ. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ఈసారి బీజేపీ సంకీర్ణ సర్కార్ కు భంగపాటు తప్పదని హెచ్చరించారు.