NEWSNATIONAL

మీ రుణం తీర్చుకుంటాం

Share it with your family & friends

ప్రియాంక‌ ..రాహుల్ గాంధీ

ఉత్త‌ర ప్ర‌దేశ్ – రాయ్ బ‌రేలి ప్ర‌జ‌ల‌కు రుణ‌ప‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక‌ గాంధీ. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌తిపక్షాల‌తో కూడిన ఇండియా కూట‌మి యూపీలో అద్బుత‌మైన ఫ‌లితాలు సాధించింది.

ఇదిలా ఉండ‌గా త‌న సోద‌రుడు రాహుల్ గాంధీని, త‌న‌ను, త‌మ కుటుంబాన్ని ప‌దే ప‌దే టార్గెట్ చేస్తూ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన మాజీ మంత్రి కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీని అమేథీలో ఓడించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు.

రాయ్ బ‌రేలీలో భారీ విజ‌యాన్ని చేకూర్చి పెట్టినందుకు గాను ధ‌న్య‌వాద స‌భ‌ను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. బుధ‌వారం జ‌రిగిన ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో ఆమె పాల్గొని ప్ర‌సంగించారు. మీరు గ‌త కొన్నేళ్లుగా గాంధీ కుటుంబాన్ని ఆద‌రిస్తూ వ‌స్తున్నార‌ని కొనియాడారు.

పేరు పేరునా త‌మ‌కు ఓటు వేసిన వారికి, వేయ‌ని వారికి ధ‌న్య వాదాలు తెలియ చేసుకుంటున్నాన‌ని అన్నారు ప్రియాంక గాంధీ. ఈ సంద‌ర్బంగా రాహుల్ గాంధీ ప్ర‌సంగిస్తూ ఏమిచ్చి మీ రుణం తీర్చు కోగ‌ల‌న‌ని అన్నారు. మీతో పాటే ఉంటాన‌ని , సేవ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు.