వాయనాడ్ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ రికార్డ్
రాహుల్ గాంధీ మెజారిటీని బ్రేక్ చేసిన సోదరి
కేరళ – వయనాడ్ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో రికార్డ్ బ్రేక్ చేశారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. ఆమె ఏకంగా 3.68 లక్షల మెజారిటీని సాధించింది. గతంలో ఇక్కడ ఎంపీగా గెలుపొందిన రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఓట్లు సంపాదించడం విశేషం. ఆనాడు రాహుల్ కు 3.64 లక్షల మెజారిటీ దక్కింది.
మహారాష్ట్ర, జార్ఖడ్ రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరగగా వయనాడ్ లో ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ పోటీ చేసి గెలుపొందిన రాహుల్ గాంధీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాయ్ బరేలీలో కూడా గెలుపొందారు. దీంతో వయానాడు సీటును వదులుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఇక్కడి నుంచి తన సోదరి ప్రియాంక గాంధీని నిలబెట్టింది.
ఎన్నికల సందర్బంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు రాహుల్ , ప్రియాంక గాంధీ వాద్రాలు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది. కానీ ప్రియాంకకు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 14 లక్షలకు పైగా నమోదిత ఓటర్లు ఉన్న ఈ స్థానంలో దాదాపు 65 శాతం పోలింగ్ నమోదైంది – ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో 74 శాతానికి తగ్గింది .