DEVOTIONAL

తిరునెల్లిని ద‌ర్శించుకున్న ప్రియాంక గాంధీ

Share it with your family & friends

త‌న తండ్రి అస్థిక‌ల‌ను ఇక్క‌డే నిమ‌జ్జ‌నం

కేర‌ళ – ఏఐసీసీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి, ప్ర‌స్తుతం వాయ‌నాడు లోక్ స‌భ స్థానం ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన ప్రియాంక గాంధీ వాద్రా ఆదివారం కేర‌ళ‌లో ప్ర‌సిద్ది చెందిన పురాత‌న దేవాల‌యం తిరునెల్లి ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్బంగా ఆమెకు పూజారులు సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. త‌న సోద‌రుడిని గెలిపించిన‌ట్లుగానే త‌న‌కు కూడా విజ‌యం ద‌క్కేలా చూడాల‌ని ప్రార్థ‌న‌లు చేశారు.

ఇదిలా ఉండ‌గా ఈ ఆలయం పక్కనే ప్రవహించే పాపనాసిని నదిలో గతంలో ఆమె తండ్రి, దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అస్థికలను నిమజ్జనం చేశారు.

ఇక్కడ కొలువు తీరిన భగవాన్ మహా విష్ణువు ఆలయం ఎంతో పురాతనమైన దేవాలయం గా వినుతి కెక్కింది. వాయ‌నాడుతో పాటు రాయ్ బ‌రేలి లో రెండు చోట్ల పోటీ చేశారు రాహుల్ గాంధీ. ఈ రెండింటి లోనూ ఆయ‌న గెలుపొందారు.

కాగా అంద‌రూ త‌న‌ను ఆద‌రించిన వాయ‌నాడును పెట్టుకుని రాయ్ బ‌రేలిని సోద‌రికి అప్ప‌గిస్తార‌ని అనుకున్నారు అంతా. కానీ వాయ‌నాడు వాసుల‌కు బిగ్ షాక్ ఇస్తూ రాహుల్ గాంధీ వాయ‌నాడు ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గ‌త ఎన్నిక‌ల్లో స్మృతీ ఇరానీ చేతిలో ఓటమి పాల‌య్యారు. వాయ‌నాడులో స‌క్సెస్ అయ్యారు. ప్ర‌స్తుతం త‌న అదృష్టాన్ని ప‌రీక్షించు కుంటోంది ప్రియాంక గాంధీ.