గోల్డెన్ వద్ద ఖలిస్తాన్ నినాదాలు
ఆపరేషన్ బ్లూ స్టార్ 40వ వార్షికోత్సవం
పంజాబ్ – పంజాబ్ లోని అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రత్యేకంగా ఖలిస్తాన్ దేశం కావాలనే నినాదాలు మిన్నంటాయి. జూన్ 6న గురువారం ఆపరేషన్ బ్లూ స్టార్ 40వ వార్షికోత్సవం సందర్బంగా ఖలిస్తానీ అనుకూల వాదులు భారీ ఎత్తున తరలి వచ్చారు.
శిరోమణి అకాలీదళ్ (అమృత్ సర్ ) చీఫ్ సిమ్రంజిత్ సింగ్ మాన్ కూడా ఇందులో ఉండడం విశేషం. అంతే కాకుండా బంగారు దేవాలయ ప్రాంగణంలో జర్నైల్ సింగ్ బింద్రన్ వాల్ కు చెందిన పోస్టర్లు కూడా కనిపించడం విస్తు పోయేలా చేసింది. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పారా మిలటరీని మోహరించారు.
ఈసారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీని పొట్టన పెట్టుకున్న బియాంత్ సింగ్ కుమారుడు సరబ్జిత్ సింగ్ ఖల్సా పంజాబ్ లోని ఫరీద్ కోట్ లోక్ సభ నుంచి ఇండిపెండెంట్ గా గెలుపొందారు. ఇదిలా ఉండగా భింద్రన్ వాలే రాడికల్ సిక్కు సంస్థ దమ్ దామి తక్సల్ కు చీఫ్. జూన్ 1984లో గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్ నుండి తీవ్రవాదులను తరిమి కొట్టేందుకు భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ బ్లూ స్టార్ లో తను మరణించాడు.