ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్
హైదరాబాద్ – మెగా ఫ్యాన్స్ దెబ్బకు దిగి వచ్చారు ప్రముఖ నిర్మాత మెగా ఫ్యామిలీకి చెందిన అల్లు అరవింద్. తను చేసిన కామెంట్స్ కు తాను క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు. చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి నోరు జారారు. దీంతో పెద్ద ఎత్తున బాయ్ కాట్ అల్లు అరవింద్ , అల్లు అర్జున్ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ మొదలయ్యాయి. దీంతో మరింత ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు.
సోమవారం అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ తేజ తనకు స్వయంగా మేనల్లుడని, ఒక రకంగా చెప్పాలంటే తనకు బిడ్డ లాంటి వాడన్నారు. తను నటించిన గేమ్ ఛేంజర్ మూవీ అట్టర్ ప్లాప్ గురించి అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు. దీనికి తాను చాలా బాధ పడుతున్నానని చెప్పారు. పొరపాటు జరిగిందని మన్నించాలని కోరారు.
ఇదే సమయంలో ప్రముఖ నిర్మాత, తెలంగాణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకట రమణా రెడ్డి అలియాస్ దిల్ రాజు పై కూడా నోరు పారేసుకున్నారు. తన గురించి తప్పుగా మాట్లాడానని, ఏమీ అనుకోవద్దని కోరారు. మొత్తంగా అల్లు అరవింద్ తన తప్పు తెలుసు కోవడం , బహిరంగంగానే సారీ చెప్పడంతో మెగా ఫ్యాన్స్ సంతోషానికి లోనయ్యారు.